top of page
Suresh D

'సలార్' రిలీజ్ డేట్ వాయిదా..కొత్త విడుదల తేదీని త్వరలో చెబుతామన్న మేకర్స్..🎥🌟

ఈ నెల 28వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా ఇంతకుముందే ప్రకటించారు. అయితే ఆ రోజున థియేటర్లకు ఈ సినిమా రావడం లేదు. కొన్ని కారణాల వలన ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు.

ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో 'సలార్' సినిమా రూపొందుతోంది. హోంబలేఫిలిమ్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సంస్థతో కలిసి ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన 'కేజీఎఫ్' .. 'కేజీఎఫ్ 2' సినిమాలు సంచలన విజయాన్ని సాధించాయి. వసూళ్ల విషయంలో కొత్త రికార్డులను నమోదు చేశాయి. అదే బ్యానర్ లో ఇప్పుడు ఆయన 'సలార్' సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇంతవరకు చాలా తక్కువ అప్ డేట్స్ వచ్చాయి. అయినా అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ఈ నెల 28వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా ఇంతకుముందే ప్రకటించారు. అయితే ఆ రోజున థియేటర్లకు ఈ సినిమా రావడం లేదు. కొన్ని కారణాల వలన ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. క్వాలిటీ విషయంలో రాజీ లేకుండా ఈ సినిమాను అందించే ప్రయత్నంలో ఆలస్యం అవుతోందనీ, అర్థం చేసుకోవాలని ఈ ప్రకటన ద్వారా తెలియజేశారు. కొత్త విడుదల తేదీ ఎప్పుడు అనేది ఈ నెల 28లోగా తెలియజేయనున్నారు.🎥🌟


bottom of page