ఈ నెల 28వ తేదీన థియేటర్లకు రావలసిన ఈ సినిమా, కొన్ని కారణాల వలన వాయిదా పడింది. ఈ సినిమా ఓటీటీ హక్కులకు సంబంధించిన వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది.
ప్రభాస్ నుంచి రానున్న పాన్ ఇండియా సినిమాలలో 'సలార్' ఒకటి. హోంబలే ఫిలిమ్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ నెల 28వ తేదీన థియేటర్లకు రావలసిన ఈ సినిమా, కొన్ని కారణాల వలన వాయిదా పడింది. ఈ సినిమా ఓటీటీ హక్కులకు సంబంధించిన వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో .. సోనీ లివ్ .. నెట్ ఫ్లిక్స్ వారు పోటీపడినట్టుగా చెబుతున్నారు. చివరికి నెట్ ఫ్లిక్స్ వారు స్ట్రీమింగ్ హక్కులను చేజిక్కించుకున్నట్టుగా తెలుస్తోంది.ఇందుకు గాను నెట్ ఫ్లిక్స్ వారు 185 కోట్లను చెల్లించినట్టుగా చెబుతున్నారు. ప్రభాస్ కి గల మార్కెట్ .. ప్రశాంత్ నీల్ కి గల ఇమేజ్ .. హోంబలే బ్యానర్ వ్యాల్యూ ఇందుకు కారణమని అంటున్నారు.🎥🎞️