'సలార్' విడుదల ఎప్పుడు? ఇప్పుడు ఇదొక పెద్ద క్వశ్చన్ మార్క్! ఎందుకంటే... సెప్టెంబర్ 28న విడుదల కావడం లేదు అనేది నూటికి నూరుపాళ్ళు నిజం! అది తెలిసి ఆ రోజు, తర్వాత రోజు నాలుగైదు తెలుగు, తమిళ సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి.
'సలార్' విడుదల ఎప్పుడు? ఇప్పుడు ఇదొక పెద్ద క్వశ్చన్ మార్క్! ఎందుకంటే... సెప్టెంబర్ 28న విడుదల కావడం లేదు అనేది నూటికి నూరుపాళ్ళు నిజం అది తెలిసి ఆ రోజు, తర్వాత రోజు నాలుగైదు తెలుగు, తమిళ సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. అయితే ఇప్పటి వరకు తమ సినిమా విడుదల వాయిదా పడిందని 'సలార్' దర్శక, నిర్మాతల నుంచి ఎటువంటి అధికారిక సమాచారం లేదు. దీంతో రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు డిజప్పాయింట్ అవుతున్నారు.'సలార్' వాయిదా పడిందని బలంగా చెప్పడానికి ఆధారం ఏమిటంటే... టికెట్ అమౌంట్ రిఫండ్ చేస్తున్నారు. వాయిదా వేయాలని అనుకోవడానికి ముందు ఓవర్సీస్ మార్కెట్లలో అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ చేశారు. రెబల్ స్టార్ ఫ్యాన్స్ చాలా మంది టికెట్స్ బుక్ చేసుకున్నారు కూడా! సెప్టెంబర్ 28న రిలీజ్ క్యాన్సిల్ కావడంతో వాళ్ళకు టికెట్ అమౌంట్ రిఫండ్ చేస్తున్నామని బుకింగ్స్ యాప్స్ నుంచి మెసేజ్ వచ్చింది. దాంతో ఫ్యాన్స్ అప్‌సెట్ అయ్యారు.🎥🎞️