రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం "కల్కి 2898 AD," టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీ జూన్ 27, 2024న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కి రెడీ అయిపోయింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ఆడియెన్స్ కి సినిమా పై ఆసక్తి కలిగించే విధంగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. బుజ్జి లాంఛ్ ఈవెంట్ సూపర్ సక్సెస్ అయ్యింది, కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ తో ఈ బుజ్జి రోల్ ఆకట్టుకుంది.
సినిమా ను అందరికీ చేరువ చేసే విధంగా బుజ్జి & భైరవ అనే యానిమేటెడ్ సిరీస్ ను ప్రైమ్ వీడియో లో రిలీజ్ చేశారు. రెండు ఎపిసోడ్ లతో ఉన్న ఈ సిరీస్ లో ప్రభాస్ భైరవ రోల్ లో సాలిడ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. మరిన్ని ఎపిసోడ్ లను సినిమా రిలీజ్ అనంతరం విడుదల చేయనున్నారు.
ఈ సిరీస్ సినిమా పై ప్రేక్షకుల్లో క్యూరియాసిటి క్రియేట్ చేయడం జరిగింది. తమ అభిమాన హీరో ప్రభాస్ ను ఇలాంటి రోల్ లో చూడటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ కూడా ప్రశంసలు అందుకుంటున్నారు. వెండితెర పై ఇదే రేంజ్ పెర్ఫార్మెన్స్ కొనసాగితే బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయం.
ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో దీపికా పదుకునే, దిశా పటాని కథానాయికలు గా నటిస్తుండగా, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.