ఓవరాల్‌గా రూ. 700 కోట్లు రాబట్టిన సలార్ చాలా రోజుల తర్వాత ప్రభాస్‌కు ఒక మంచి సాలిడ్ హిట్ అందించింది. థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సలార్ ఓటీటీలో ఎప్పుడెప్పుడొస్తుందా? అని చాలామంది ఎదురుచూస్తున్నారు. ఈ నిరీక్షణకు త్వరలోనే తెరపడనుంది.
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ చిత్రం సలార్. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ మరో కీలక పాత్ర పోషించాడు. బాబీ సింహా, జగపతి బాబు, టినూ ఆనంద్, శ్రియా రెడ్డి తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. డిసెంబర్ 22న విడుదలైన సలార్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లు కురిపించింది. ఓవరాల్‌గా రూ. 700 కోట్లు రాబట్టిన సలార్ చాలా రోజుల తర్వాత ప్రభాస్‌కు ఒక మంచి సాలిడ్ హిట్ అందించింది. థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సలార్ ఓటీటీలో ఎప్పుడెప్పుడొస్తుందా? అని చాలామంది ఎదురుచూస్తున్నారు. ఈ నిరీక్షణకు త్వరలోనే తెరపడనుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్ ఫ్లిక్స్ సలార్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ప్రభాస్ సినిమా నెట్‌ఫ్లిక్స్ కోసం భారీగానే చెల్లించిందని సమాచారం. ఈనేపథ్యంలో సలార్ సినిమాను త్వరలోనే ఓటీటీలోకి తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు తమ సోషల్ మీడియా ఖాతాల్లో సలార్ ఓటీటీ రిలీజ్‌పై అప్ డేట్ ఇచ్చింది.
‘ఖాన్సార్ ప్రజలు తమ మొదలుపెట్టొచ్చు. వాళ్ల సలార్ తిరిగి రాజ్యానికి వచ్చాడు. సలార్ త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది’ అని రాసుకొచ్చింది నెట్‌ఫ్లిక్స్. అయితే స్ట్రీమింగ్ డేట్‌పై ఎలాంటి అధికారిక సమచారం ఇవ్వలేదు. బహుశా గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న ప్రభాస్ సినిమాను స్ట్రీమింగ్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.