top of page
MediaFx

చిన్నారులకు ప్రభాస్ టీం బంపర్ ఆఫర్..


పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా విడుదలై నెల రోజులు కావస్తోంది. అయినా ఈ సినిమా కలెక్షన్ల ప్రభంజనం ఆగడం లేదు. బాక్సాఫీస్ వద్ద ఊహించని వసూళ్లు రాబడుతోంది. బరిలో పెద్ద సినిమాలేవీ కూడా లేకపోవడంతో ‘కల్కి 2898 AD’ సినిమా చూడ్డానికి జనాలు ఎగబడుతున్నారు. దీంతో ‘కల్కి 2898 ఏడీ’ సినిమా 1000 కోట్ల క్లబ్‌లో ఈజీగా చేరిపోయింది. ఈ క్రమంలోనే తాజాగా కల్కి మేకర్స్.. తెలుగు టూ స్టేట్స్లో ఉన్న చిన్న పిల్లలకు ఒక గోల్డెన్ చాన్స్ ఇచ్చారు. కల్కి మూవీ కోసం వేసిన సెట్‌ను చూసే గోల్డెన్ చాన్స్‌ను… చిన్నపిల్లలకు ఇస్తున్నట్లు కల్కి నిర్మాతలు తాజాగా ప్రకటించారు. ఇందుకు పిల్లలు ఏం చేయాలో చెబుతూ తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఓ పోస్ట్ పెట్టారు. ఇందుకోసం మీ చిన్నారితో కల్కి సినిమాకు గురించి మాట్లాడించి.. ఆ వీడియో వారికి తమకు పంపాలని ఆ పోస్టులో వివరించారు. అంతేకాదు ఆ వీడియోకు ILoveKalki అనే హ్యాష్‌ట్యాగ్‌ని కూడా జత చేయాలని చెప్పారు. అలా పంపిన వారిలో కొందరి ఎంపిక చేసి కల్కి సెట్ చూసే అవకాశం ఇస్తామని మేకర్స్ ప్రకటించారు.

bottom of page