ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమా కుమ్మేస్తుంది. ఎక్కడ చూసిన కల్కి సినిమా పేరే వినిపిస్తుంది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అన్ని ఏరియాల నుంచి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ సినిమా 500 కోట్లు వసూల్ చేసింది. అలాగే నార్త్ లో కూడా రికార్డ్ క్రియేట్ చేసింది. అక్కడ వందకోట్లకు పైగా కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. మహాభారత నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషించారు. అలాగే టాలీవుడ్ హీరోలు కూడా చాలా మందే ఉన్నారు. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో చిత్రయూనిట్ ఆనందంలో తేలిపోతున్నారు.
ఇక నాగ్ అశ్విన్ పై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. హాలీవుడ్ సినిమాలను తలపించేలా.. తలదన్నేలా సినిమా చేశాడు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా కల్కి సినిమాను మరిన్ని పార్టులుగా తీసుకురానున్నారు. పార్ట్ 2కి హింట్ ఇస్తూ కల్కి సినిమాను ఎండ్ చేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్. అంతే కాదు పార్ట్ 2 షూటింగ్ కూడా దాదాపు 60 శాతం పూర్తయ్యిందని తెలుస్తోంది. ఇటీవలే నిర్మాత అశ్విని దత్ కూడా కల్కి పార్ట్ 2 గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ఇదిలా ఉంటే కల్కి సినిమా పార్ట్ 2 మ్యూజిక్ డైరెక్టర్ మారుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కల్కి సినిమాకు సంతోష్ నారాయణ సంగీతం అందించారు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగున్నప్పటికీ ఎక్కడో ఇంకా బాగా ఇవ్వచ్చు అనే ఫీల్ కలిగింది కొందరికి ప్రభాస్ సినిమాకు ఈ మ్యూజిక్ సరిపోదు.. కొడితే బాక్స్ లు బద్దలవ్వాలి.. ముఖ్యంగా ఎలివేషన్స్ లో అదిరిపోవాలి అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో కల్కి 2 లో మ్యూజిక్ డైరెక్టర్ ను మార్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. సంతోష్ నారాయణ్ ప్లేస్ లోకి కీరవాణిని తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కల్కీ పార్ట్ 2లో ఎక్కువగా మహాభారతాన్ని టచ్ చేయనున్నాడు నాగ్ అశ్విన్. కాబట్టి మైథలాజికల్ సినిమాల్లో బాగా అనుభవం ఉన్న కీరవాణి అయితే బెటర్ అని ఫీల్ అవుతున్నట్టు టాక్ వినిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది.