యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బ్యాక్ టూ బ్యాక్ మూవీ షూటింగ్స్‌లో పాల్గొంటున్నాడు. వీలైనంత త్వరగా తన ప్రాజెక్ట్స్ అడియన్స్ ముందుకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న ప్రభాస్ ఫ్యాన్స్ ముందుకు వచ్చి చాలా రోజులైంది. అలాగే అటు నెట్టింట కూడా డార్లింగ్ ఫోటోస్, వీడియోస్ కనిపించడం లేదు. అయితే ఇప్పుడు గత రెండు మూడు రోజులుగా ప్రభాస్ కు సంబంధించిన కొన్ని వీడియోస్, ఫోటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న కల్కి మూవీ సెట్ లో కొందరు అభిమానులతో ఫోటోస్ దిగారు ప్రభాస్. ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరలవుతుండగా.. ప్రభాస్ న్యూలుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.
ఇప్పుడు నెట్టింట వైరలవుతున్న ఫోటోస్ ప్రభాస్ లాంగ్ హెయిర్ తో బరువు తగ్గి.. చాలా స్లిమ్ గా కనిపిస్తూ ఒకప్పటి డార్లింగ్ ను గుర్తుకు తెస్తున్నారు. ఇక ఇప్పుడు డార్లింగ్ న్యూలుక్ చూసి ఆశ్యర్యపోతున్నారు ఫ్యాన్స్. డార్లింగ్ ఈజ్ బ్యాక్.. ప్రభాస్ న్యూలుక్ కిర్రాక్.. ఏమున్నాడ్రా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ప్రభాస్ కొత్త లుక్ కల్కి సినిమాలోనిదా ? లేదా రాజాసాబ్ మూవీ కోసమా? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు మరికొందరు ఫ్యాన్స్. ఇప్పుడు ప్రభాస్ న్యూలుక్ మాత్రం నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది.
ఇదిలా ఉంటే.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న కల్కి ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటాని, దీపికా పదుకొణె కీలకపాత్రలు పోషిస్తున్నారు. నిజానికి ఈ మూవీని మే9న రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఎలక్షన్స్ హడావిడి ఉండడంతో ఈ చిత్రాన్ని వాయిదా వేసినట్లుగా టాక్ నడుస్తుంది.