top of page
MediaFx

ఫస్ట్ క్రష్ గురించి చెబుతూ తెగ సిగ్గుపడిపోయిన ప్రభాస్..


ప్రభాస్ పెళ్లి సమయం వచ్చినప్పుడు కచ్చితంగా జరుగుతుందంటూ డార్లింగ్ పెద్దమ్మ శ్యామలా దేవి పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది. కానీ ప్రభాస్ పెళ్లి గురించి అడియన్స్, ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ ఎప్పుడూ పెళ్లి ప్రకటన చేస్తారు ? అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఎప్పుడూ ఎక్కడా తన గురించి ఎక్కువగా మాట్లాడని ప్రభాస్ మొదటిసారి తన ఫస్ట్ క్రష్ గురించి చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. అందులో తన ఫస్ట్ క్రష్ గురించి చెబుతూ సిగ్గుపడిపోతున్నాడు ప్రభాస్.

ఒక తమిళ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ తన ఫస్ట్ క్రష్ ఎవరో రివీల్ చేశాడు. మీ ఫస్ట్ క్రష్ ఎవరు ?.. స్కూల్లోనా లేదా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ? అని యాంకర్ అడగ్గా.. స్కూల్లోనే అంటూ ఆన్సర్ ఇచ్చారు ప్రభాస్. అయితే ఆ అమ్మాయి పేరు ఏంటీ అని అడిగితే గుర్తులేదు.. మర్చిపోయాను అంటూ నవ్వుకున్నారు. ఏ క్లాస్ లో ఉన్నప్పుడు అని అడిగేసరికి క్లాస్ మెట్ కాదు.. టీచరే నా ఫస్ట్ క్రష్.. నేను చదివింది కూడా ఇక్కడే చెన్నైలో .. ఆ టీచర్ చాలా బాగుండేది అంటూ చెప్పుకొచ్చారు ప్రభాస్. అయితే ఫస్ట్ క్రష్ గురించి అడగ్గానే ప్రభాస్ సిగ్గు పడుతూ, నవ్వుతూ ఆన్సర్ ఇచ్చిన వీడియో ఇప్పుడు ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది. ప్రభాస్ ఫేస్ లో బ్లషింగ్, ఎంత ముద్దుగా చెబుతున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

bottom of page