ప్రభాన నటిస్తున్న కల్కి 2898 ఏడీ మూవీ రిలీజ్ డేట్ వాయిదా పడేలా కనిపిస్తోంది. ఈ సినిమా మే 9న రిలీజ్ కానుండగా.. మే 13నే ఏపీ, తెలంగాణాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
కల్కి 2898 ఏడీ మూవీ రిలీజ్ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. మొత్తానికి వైజయంతీ మూవీస్ కు బాగా కలిసొచ్చిన మే 9వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు గత నెలలోనే మేకర్స్ స్పష్టం చేశారు. ఆ రోజు కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా వెలువడిన ఎన్నికల షెడ్యూల్ తో సినిమా రిలీజ్ పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.కల్కి ఓ పాన్ ఇండియా మూవీయే అయినా.. రెండు తెలుగు రాష్ట్రాలే సినిమాకు చాలా కీలకం. అలాంటిది ఎన్నికలకు కేవలం నాలుగు రోజుల ముందు రిలీజ్ అంటే రిస్క్ చేసినట్లే అన్న వాదన వినిపిస్తోంది. సోషల్ మీడియాలో శనివారం మధ్యాహ్నం నుంచి ఇదే చర్చ నడుస్తోంది. మే 11 వరకూ ఎన్నికల ప్రచారం కొనసాగనుంది. అందులోనూ ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ రెండింటికీ ఎన్నికలు జరగనున్నాయి.దీంతో జనమంతా ఆ ఎన్నికల హడావిడిలోనే ఉంటారు. ఈ నేపథ్యంలో మూవీని రిలీజ్ చేసే సాహసం మేకర్స్ చేస్తారా అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. అయితే దీనిపై మూవీ టీమ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. అలాగని ఈ పుకార్లను కూడా ఖండించకపోవడంతో ఈ సందేహాలు మరింత ఎక్కువయ్యాయి.🎥✨