సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీ పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. మొదటి రోజే రికార్డ్స్ బ్రేక్ కలెక్షన్స్ వసూలు చేసింది.
సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీ పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. మొదటి రోజే రికార్డ్స్ బ్రేక్ కలెక్షన్స్ వసూలు చేసింది. చాలా కాలం తర్వాత ఈ సినిమాలో ఫుల్ మాస్ అవతారంలో అదరగొట్టేశాడు ప్రభాస్. ఎన్నాళ్లుగానో సరైన హిట్ కోసం వెయిట్ చేస్తోన్న రెబల్ స్టార్ అభిమానులకు అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందించాడు నీల్. డిసెంబర్ 22న విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. నీల్ తెరకెక్కించిన సలార్ చిత్రంలోనే దేవా పాత్ర ప్రభాస్ కెరీర్లోనే మైలురాయి ప్రదర్శనలలో ఒకటి. దీంతో ఇప్పుడు డార్లింగ్ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలో తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు ప్రభాస్.
ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ మాట్లాడుతూ.. తాను ఎంచుకునే సినిమాలు.. తన నటనతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను అలరించడమే తన ఏకైక లక్ష్యం అని అన్నారు. విభిన్న పాత్రలను, భిన్నమైన కంటెంట్ ప్రయత్నించడానికి కారణం అభిమానులకు వినోదాన్ని అందించడమే అని అన్నారు. అలాగే ఇప్పుడు తాను చేస్తోన్న ప్రతి సినిమా ఏఏ జానర్ అనే విషయాన్ని బయటపెట్టాడు. ఇటీవలే విడుదలైన సలార్ సినిమా భారీ యాక్షన్ డ్రామా అయితే.. కల్కి 2898 AD భవిష్యత్ వైజ్ఞానిక కల్పనగా ఉంటుందని.. అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోయే స్పిరిట్ సినిమా చాలా వరకు ఆకట్టుకునే కథ అని.. అలాగే ప్రస్తుతం తాను హారర్ చిత్రంలో నటిస్తున్నానని అన్నారు. దీంతో మారుతి, ప్రభాస్ కాంబోలో రాబోతున్న సినిమా హారర్ కథ అని హింట్ ఇచ్చేశాడు డార్లింగ్. దీంతో ప్రభాస్ రాబోయే సినిమాలపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది.🎥✨