పాన్ ఇండియా స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల కోసం అభిమానులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలను లైనప్ చేసి అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. ఇటీవలే సలార్ సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు మన రెబల్ స్టార్. దాదాపు ఆరేళ్ళ తర్వాత ప్రభాస్ నుంచి ఇలాంటి సినిమా వచ్చింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సలార్ సినిమా ఏకంగా 700 కోట్ల వరకు వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ప్రేక్షకులంతా సలార్ పార్ట్ 2 కోసం ఎదురుచూస్తున్నారు. అలాగే ప్రభాస్ ప్రస్తుతం కల్కి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా చాలా డిఫరెంట్ గా ఉండనుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతుంది.
ఈ సినిమాలో చాలా మంది నటీనటులు కనిపించనున్నారు. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె హీరోయిన్ గా నాటిస్తున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ గా దిశా పటాని నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ వార్త ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. కల్కి సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా కనిపించనున్నారని అంటున్నారు. ఇప్పటికే దర్శకుడు నాగ్ అశ్విన్ మహేష్ బాబును సంప్రదించారట. కల్కి సినిమాలో ప్రభాస్ విష్ణు అవతారంలో కనిపించనున్నాడు. విష్ణు అవతారం అయిన ప్రభాస్ ను పరిచయం చేసేందుకు మహేష్ బాబును రంగంలోకి దింపుతున్నారట. ప్రభాస్ ఇంట్రో, ఎలివేషన్ కు మహేష్ బాబు వాయిస్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. గతంలో మహేష్ బాబు జల్సా, బాద్షా, ఆచార్య సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇప్పుడు ప్రభాస్ సినిమాకు మహేష్ బాబు వాయిస్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఈ వార్తలో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. ఇదే నిజమైతే అభిమానులకు పండగే.. మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.