top of page
MediaFx

కన్నప్ప సెట్‏లో అడుగుపెట్టిన ప్రభాస్..


విష్ణు మంచు కన్నప్ప సినిమాకు సంబంధించిన అప్డేట్లు ఎంతగా వైరల్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే. ఈ మధ్యే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కన్నప్ప సినిమా షూట్‌ను పూర్తి చేసి వెళ్లాడు. దాదాపు ఈ మూవీ షూటింగ్ పూర్తి కావొస్తోంది. ఇక చివరగా మిగిలిన ప్రభాస్ సీన్లను షూట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు ప్రభాస్ కన్నప్ప సెట్స్ మీదకు వచ్చేశాడట. ప్రభాస్ సెట్స్‌లోకి అడుగు పెట్టాడంటూ విష్ణు వేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

అసలే కన్నప్ప సినిమా మీద దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఒక్కో ఇండస్ట్రీ నుంచి స్టార్‌ను కన్నప్ప కోసం దించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నుంచి అక్షయ్, మాలీవుడ్ నుంచి మోహన్ లాల్ వంటి వారిని దించారు. ఇక ఇప్పుడు ప్రభాస్ మీద కొన్ని కీలకమైన సన్నివేశాలను షూట్ చేయబోతోన్నారు. ఆల్రెడీ న్యూజిలాండ్ షెడ్యూల్‌లో శరత్ కుమార్, బ్రహ్మానందం, మోహన్ బాబు వంటి వారి మీద సీన్లను షూట్ చేశారన్న విషయం తెలిసిందే.

మై బ్రదర్ కన్నప్ప సెట్‌లో జాయిన్ అయ్యారు అంటూ ప్రభాస్ గురించి అప్డేట్ ఇచ్చాడు విష్ణు మంచు. ఈ మేరకు ప్రభాస్ కనిపించకుండా జాగ్రత్త పడుతూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్ కాళ్లని మాత్రమే చూపించారు. ప్రభాస్‌ ఈ సినిమా ఏ రోల్‌లో కనిపిస్తాడని ఇప్పటికే ఆసక్తి పెరిగిపోయిన సంగతి తెలిసిందే. కొందరేమో ప్రభాస్ శివుడిలా కనిపిస్తాడని అంటున్నారు. ఇంకొందరేమో అక్షయ్ కుమార్ శివుడి పాత్రని పోషించాడని చెబుతున్నారు. మరి ఈ సస్పెన్స్‌కి ఎప్పుడు తెరదించుతారో చూడాలి.



bottom of page