top of page
Suresh D

హ‌నుమాన్ మూవీలో చిరంజీవి గెస్ట్ రోల్? - డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ ఏమ‌న్నాడంటే? 🎥🕵️‍♂️

హ‌నుమాన్ మూవీలో మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ రోల్‌లో న‌టించిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ పుకార్ల‌పై హ‌నుమాన్ ప్ర‌మోష‌న్స్‌లో డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. 🎬💬

సంక్రాంతికి రిలీజ్ అవుతోన్న హ‌నుమాన్ మూవీలో చిరంజీవి గెస్ట్ రోల్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. హ‌నుమంతుడి అండ‌తో సూప‌ర్ హీరోగా మారిన ఓ యువ‌కుడి క‌థ‌తో హ‌నుమాన్ మూవీని తెర‌కెక్కిస్తున్నాడు ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. క‌థ‌లో అంజ‌నేయుడి పాత్ర కీల‌కంగా ఉండ‌బోతున్న‌ట్లు స‌మాచారం. హ‌నుమాన్ పాత్ర‌లో చిరంజీవి గెస్ట్ రోల్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

ఇటీవ‌ల రిలీజైన ట్రైల‌ర్‌లో అంజ‌నేయుడి పాత్ర‌కు సంబంధించిన క‌ళ్ల‌ను మాత్ర‌మే చూపించారు. లుక్‌ను రివీల్ చేయ‌కుండా స‌స్పెన్స్ మెయింటేన్ చేశాడు డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ‌. 🕵️‍♂️💡

చిరంజీవి క‌ళ్ల‌ను పోలి ఉండ‌టంతో లార్డ్ హ‌నుమాన్ పాత్ర‌ను మెగాస్టార్ చేశాడంటూ సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ వార్త‌ల‌పై హ‌నుమాన్ ప్ర‌మోష‌న్స్‌లో డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. అంజ‌నేయుడి పాత్ర‌ను చేసింది ఎవ‌ర‌న్న‌ది తాను చెప్ప‌న‌ని, సినిమా చూసి తెలుసుకోవాల్సిందేన‌ని కామెంట్స్ చేశాడు. 💬🎭

ట్రైల‌ర్‌లో క‌నిపిస్తోన్న‌వి చిరంజీవి క‌ళ్లు అని చాలా మంది అంటున్నారు. అవి ఎవ‌రి క‌ళ్లు అనేది నేను రివీల్ చేయ‌ను. హ‌నుమాన్ క్యారెక్ట‌ర్ చిరంజీవి చేశాడా? లేదా? అన్న‌ది థియేట‌ర్ల‌లో సినిమా చూస్తేనే క్లారిటీ వ‌స్తుంది. 🤔🎭

సినిమా చూసే ఆ న‌టుడు ఎవ‌ర‌న్న‌ది తెలుసుకోవాలి అంటూ ఆస‌క్తిక‌రంగా ఆన్స‌ర్ చెప్పాడు. హ‌నుమాన్ మూవీ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న రిలీజ్ అవుతోంది. అమృత అయ్య‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాలో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ కీల‌క పాత్ర పోషిస్తోంది. విన‌య్ రాయ్ విల‌న్‌గా న‌టిస్తోన్నాడు. 🌟👩‍🎤👨‍🚀


bottom of page