top of page

ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్లాప్ కొట్టిన ఎన్టీఆర్..

MediaFx

టాలీవుడ్ అగ్ర‌ క‌థానాయ‌కుడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, క‌న్న‌డ స్టార్ ద‌ర్శ‌కుడు కేజీఎఫ్‌, స‌లార్ చిత్రాల ఫేమ్ ప్రశాంత్ నీల్‌ (PrashanthNeel) కాంబోలో ఒక సినిమా రానున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాను గ‌తేడాది ప్ర‌క‌టించగా ఇప్ప‌టివ‌ర‌కు పట్టాలెక్కలేదు. అయితే ఈ క్రేజీ కాంబో షూటింగ్ ఎప్పుడు మొద‌ల‌వుతుందా.. ఎప్పుడెప్పుడు సినిమా నుంచి అప్​డేట్‌లు వస్తాయా అని తారక్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు మేక‌ర్స్. తాజాగా ఈ సినిమా షూటింగ్ నేడు(ఆగస్ట్ 9) పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. రామానాయుడు స్టూడియోస్‌లో ఈ వేడుక జరుగ‌గా.. ఈ వేడుకకు ఎన్టీఆర్‌, ప్రశాంత్ నీల్ ఇరు కుటుంబ సభ్యులు ఈ ఈవెంట్​కు హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్‌కు తార‌క్ హాజ‌రు కావాట్లేద‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ వార్త‌ల‌కు చెక్ పెడుతూ.. ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టాడు. తార‌క్ భార్య లక్ష్మీ ప్రణతి కెమెరా స్విచ్ ఆన్ చేసింది. ఈ సినిమాను మైత్రి మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ భారీ బ‌డ్జెట్‌తో నిర్మించ‌బోతుంది. ఈ సినిమాను జ‌న‌వ‌రి 09 2026లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది.




bottom of page