సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ తొలినాళ్లలో నటించిన సూపర్ హిట్ చిత్రం రాజకుమారుడు. 1999లో డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శక్తవం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో మహేష్ సరసన ప్రీతి జింటా నటించింది. ఈ మూవీ తర్వాత విక్టరీ వెంకటేష్ జోడిగా ప్రేమంటే ఇదేరా చిత్రంలో కనిపించింది ప్రీతి. తెలుగులో ఈ అమ్మడు చేసింది ఈ రెండు సినిమాలే అయినా.. అప్పట్లో టాలీవుడ్ ప్రేక్షకులకు ఇష్టమైన హీరోయిన్ గా మారింది. సొట్ట బుగ్గలు.. అందమైన రూపం.. క్యూట్ నెస్ తో మెప్పించింది. కానీ ఆ తర్వాత మాత్రం తెలుగులో సినిమాలు చేయలేదు. అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస మూవీస్ చేస్తూ అక్కడే సెటిల్ అయ్యింది. హిందీలో అగ్రహీరోల సరసన నటించి మెప్పించిన ప్రీతి జింటా.. 2018 నుంచి సినిమాలకు దూరమయ్యాంది. 2016లో అమెరికాకు చెందిన జీన్ గూడెనఫ్ ను వివాహం చేసుకుని అక్కడే సెటిల్ అయ్యింది.
సినిమాలకు దూరమైన ప్రీతి.. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL లో పంజాబ్ కింగ్స్ టీంకు సహ యజమానిగా ఉన్నారు.. నిత్యం క్రికెట్ మైదానంలో కనిపిస్తూ తన టీంను ఎంకరేజ్ చేస్తుంటుంది. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ప్రీతి.. ఇటీవలే హిందీలోకి ఎంట్రీ ఇచ్చింది. దాదాపు ఆరేళ్ల తర్వాత బాలీవుడ్ స్టార్ సన్నీడియోల్ నటిస్తున్న లాహోర్ 1947 చిత్రంలో కనిపించనుంది. ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రీతిజింటా.. తాజాగా ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటించింది.
ఈ క్రమంలో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చింది. మీరు మళ్లీ తెలుగు సినిమాల్లో నటిస్తారా ? అని అడగ్గా.. ప్రీతి రియాక్ట్ అవుతూ.. నేను అసలు చేయను అని ఎప్పుడూ చెప్పులేదు. మంచి కథ వినిపిస్తే నో చెప్పకుండా చేస్తాను అని తెలిపింది. అయితే తెలుగులో మంచి కథ.. పాత్ర వస్తే మాత్రం ప్రీతి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉందని తెలుస్తోంది. అయితే మరీ ఎప్పుడూ రీఎంట్రీ ఇస్తుందనేది చూడాలి.