top of page
Suresh D

HYBIZ.TV రియాల్టీ అవార్డ్స్ 2024ని ప్రకటించడానికి ప్రెస్ కాన్ఫరెన్స్🎉📢

HYBIZ.TV రియాల్టీ అవార్డ్స్ 2024..రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తున్న సంస్థలకు & ప్రముఖులకు 50 కి పైగా అవార్డులు, నామినేషన్ లకు ఆహ్వానం.

మహా సిమెంట్స్ సమర్పించు HYBIZ.TV రియాల్టీ అవార్డ్స్ 2024 అవార్డుల నామినేషన్ల ప్రక్రియ మరియు అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి సంబంధించి హైదరాబాద్‌, మాసబ్ ట్యాంక్‌లోని గోల్కొండ హోటల్‌లో మంగళవారం మీడియా సమావేశం జరిగింది. కార్యక్రమంలో అవార్డుల నామినేషన్ల పోస్టర్ తో పాటు అవార్డును ఆవిష్కరించారు. ఈ సమావేశంలో వి.రాజశేఖర్ రెడ్డి,క్రెడాయ్ హైదరబాద్ ప్రెసిడెంట్, పి.నర్సింహా రెడ్డి,డైరెక్టర్, వీర ఆర్ఎంసీ ఇండియా ప్రవేట్ లిమిటెడ్ ,  అదితి శ్రీమాల్, డైరెక్టర్,  ఫార్చున్ ఆర్ట్ ఎల్ ఈడీ లైటింగ్, ప్రకాష్ రాగి,  డైరెక్టర్ రాగి & రాగి తో పాటు ఎం. రాజగోపాల్ , పౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, హైబిజ్ టీవీ & తెలుగు నవ్ పాల్గొన్నారు. 

ఈ ఈవెంట్ కు టైటిల్ స్పాన్సర్ గా మహా సిమెంట్స్ వ్యవహరిస్తోంది. అలాగే వీర కాంక్రీట్ , LIC హోసింగ్ ఫైనాన్స్, నాగార్జున TMT , ఫార్చ్యూన్ ఆర్ట్ LED లైటింగ్స్,సుధాకర్ పైప్స్ & ఫిట్టింగ్స్, బెల్జిన్ వైర్స్ & కేబుల్స్ , పెట్ హోమ్ ఆటోమేషన్, అభిమన్య డోర్స్, పవర్ టెక్ ట్రాన్స్ఫార్మర్స్ మరియు టఫ్ స్టోన్స్ బ్లాక్స్ & పెవర్స్ తమ సహకారాన్ని అందిస్తున్నారు.

నామినేషన్లకు ఆహ్వానం 

రియల్ ఎస్టేట్ రంగంలో గత దశాబ్దాలుగా ఉత్తమమైన సేవలను అందిస్తూ  ఈ రంగంలో రాణిస్తున్న ప్రముఖులను  HYBIZ.TV  రియాల్టీ అవార్డ్స్ 2024 ద్వారా ఘనంగా సత్కరిస్తూ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహిస్తోంది. జనవరి 25 వ తేది, హెచ్ఐసిసి నోవోటల్ లో ఈ అవార్డుల వేడుక జరుగనుంది. అవార్డుల కోసం వచ్చిన నామినేషన్ల ప్రక్రియ నిర్వహణలో భాగంగా HYBIZ.TV  రియాల్టీ అవార్డ్స్ జ్యూరీ కమిటీలో రియాల్టీ రంగంతో పాటు విభిన్న రంగాల్లో వున్న జాతీయ స్థాయి ప్రముఖులు, నిపుణుల చేత అవార్డుల ఎంపిక జరుగనుంది. ఇందులో పరిశ్రమ అనుభవం, ప్రాజెక్ట్ కౌంట్, ప్రాజెక్టు వ్యయ ప్రమాణాల ఆధారంగా  వివిధ విభాగాలలో 50 కి పైగా అవార్డులను జ్యూరీ కమిటీ నామినేట్  చేయనుంది.

డిజిటల్ మీడియా రంగంలో సరి కొత్త పధ్దతిలో అత్యుత్తమంగా రాణిస్తున్న హైబిజ్.టివి భారత దేశంలో డిజిటల్ బిజినెస్ న్యూస్ ఛానెల్ లో ఒకటి. ప్రతి రోజు 5 లక్షలకు పైగా వీక్షకులను కలిగి విభిన్న రంగాలలో ప్రతిభను కనబరుస్తున్న వారి కథనాలను వీక్షకులకు అందించే ప్రయత్నం చేస్తుంది.నిష్పాక్షిక మరియు  పారదర్శకతతో రియల్ ఎస్టేట్ రంగంలో విజయం సాధించిన వారి కృషిని గుర్తిస్తూ.. ఆర్థిక వ్యవస్థ అభివృధ్దిలో తమ సహకారాన్ని అందిస్తూ సామాన్యుడి ఇంటి కలను సాకారం చేస్తున్న వారి కృషిని గుర్తిస్తోంది

నామినేషన్ల కోసం ధరఖాస్తులకు చివరి తేదీ: 18-01-2024

నామినేషన్ లింక్ https://hybiz.tv/hybiz-realty-awards-2024-nomination-form/

bottom of page