top of page
MediaFx

ప్రధాని మోదీ గుడ్ న్యూస్..


ప్రధాని మోదీ అధ్యక్షతన భేటి అయిన కేంద్ర కేబినేట్.. తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 936 కిమీ మేర పొడవున్న 8 ముఖ్యమైన జాతీయ హై-స్పీడ్ రోడ్ కారిడార్ ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేసింది. లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, రద్దీని తగ్గించడానికి.. దేశవ్యాప్తంగా కనెక్టివిటీని మెరుగుపరచడానికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని కేంద్రం ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టు విలువ సుమారు రూ. 50,655 కోట్లు ఉంటుందని అంచనా. ఇక ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా దేశ ప్రజలతో పంచుకున్నారు. ఈ ప్రాజెక్టులో 68 కిమీ అయోధ్య బైపాస్ రోడ్, 121 కిమీ గౌహతి రింగ్ రోడ్, 516 కిమీ ఖరగ్‌పూర్-సిలిగురి ఎక్స్‌ప్రెస్ వే, 6-లేన్ ఆగ్రా గ్వాలియర్ గ్రీన్‌ఫీల్డ్ హైవే(88 కిమీ), ఎనిమిది లేన్‌లతో కూడిన 30-కిమీ పొడవైన ఎలివేటెడ్ హైవేతో పాటు నాసిక్- ఖేడ్(పుణె) మధ్య 8 లేన్ రోడ్డు కూడా భాగం కానున్నాయి. ప్రాజెక్టు ప్రయోజనాలు:

ఈ ప్రాజెక్ట్‌తో ఆగ్రా, గ్వాలియర్ మధ్య ప్రయాణ దూరం 50 శాతం తగ్గుతుంది. ఖరగ్‌పూర్- మొరేగ్రామ్ కారిడార్‌తో పశ్చిమ బెంగాల్, నార్త్-ఈస్ట్ మధ్య ఆర్ధిక వ్యవస్థ మరింతగా మెరుగుపడుతుంది.

కాన్పూర్ రింగ్ రోడ్ ద్వారా ఆ నగరం చుట్టూ ఉన్న హైవే నెట్‌వర్క్స్ ఒకటి కానున్నాయి.

రైపూర్-రాంచీ కారిడార్ ద్వారా జార్ఖండ్, చత్తీస్‌ఘర్ మరింతగా అభివృద్ధి చెందనున్నాయి.

పోర్ట్ కనెక్టివిటీ, లాజిస్టిక్స్ సామర్ధ్యం మెరుగుపరచడం కోసం.. అలాగే గుజరాత్‌లో హై స్పీడ్ రోడ్ నెట్‌వర్క్‌ను పూర్తి చేయడానికి థారాడ్, అహ్మదాబాద్ మధ్య కొత్త కారిడార్ దోహదపడుతుంది.

గౌహతి రింగ్ రోడ్డు ఉత్తర తూర్పు వైపునకు అడ్డంకులు లేని హై-స్పీడ్ రోడ్డు కారిడార్ సులభతరం చేస్తుంది.

ఇకపై ఈ హై-స్పీడ్ రోడ్ కారిడార్ ద్వారా అయోధ్యకు చాలా వేగంగా ప్రయాణం చేయవచ్చు.

లాజిస్టిక్స్ ఖర్చును మరింతగా తగ్గించేందుకు పూణే, నాసిక్ మధ్య 8 లేన్ ఎలివేటెడ్ ఫ్లైఓవర్ కారిడార్ దోహదపడుతుంది.

దేశంలోని నిరుద్యోగ యువతకు ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 4.42 కోట్ల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి.



bottom of page