మలయాళీ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఆడుజీవితం. డైరెక్టర్ బ్లెస్సీ డ్రీమ్ ప్రాజెక్టుగా వచ్చిన ఈ సినిమా మార్చి 28న అడియన్స్ ముందుకు వచ్చింది. మొదటి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ అందుకున్న ఈసినిమా అటు భారీగా వసూళ్లు రాబడుతూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిందని చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొత్త పోస్టర్ శనివారం రిలీజ్ చేశారు మేకర్స్. తమ సినిమాకు అపూర్వ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు చిత్రయూనిట్..హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ధన్యవాదాలు చెప్పారు. దాదాపు 16 ఏళ్లుగా ఈ సినిమా కోసం తన కెరీర్ పణంగా పెట్టాడు పృథ్వీరాజ్.
కేరళకు చెందిన నజీబ్ అనే వ్యక్తి జీవితాన్ని ఆధారంగా చేసుకుని బెన్నీ డానియల్ గోట్ డేస్ అనే నవల రచించారు. ఈ నవలను డైరెక్టర్ బ్లెస్సీ ఆడుజీవితం పేరుతో సినిమాగా వెండితెరపైకి తీసుకువచ్చారు. రూ. 82 కోట్లతో ఈ చిత్రాన్ని దాదాపు 16ఏళ్లు శ్రమించి నిర్మించారు. ఇందులో పాత్ర కోసం 31 కిలోల బరువు తగ్గారు. అలాగే 72 గంటలపాటు భోజనం లేకుండా కేవలం మంచినీళ్లు మాత్రమే తాగి ఆయన షూట్ లో పాల్గొన్నట్లు చిత్ర ప్రమోషన్లలో మేకర్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే.
2008లో డైరెక్టర్ బ్లెస్సీ ఈ చిత్రాన్ని స్టార్ట్ చేశారు. కానీ ఆ తర్వాత అనుహ్య కారణాలు.. లాక్ డౌన్ రావడంతో దాదాపు 16 ఏళ్లు వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ చిత్రం మార్చి 28న రిలీజ్ అయ్యింది. ఇందులో అమలా పాల్, కేఆర్ గోకుల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.ఇందులో పృథ్వీరాజ్ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. నజీబ్ పాత్రలో జీవించేందుకు ఎంతగానో కష్టపడ్డాడు. ఈ చిత్రాన్ని తెలుగు, మలయాళంలో రిలీజ్ చేశారు. ఇటీవలే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ చిత్రంలో కనిపించారు పృథ్వీరాజ్. నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు