కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్.. ప్రోమోతోనే అంతా తన గురించే మాట్లాడుకునేట్టు చేసింది యాంకర్ అనసూయ. గతవారం ప్రారంభమైన ఈ షోలో.. అనసూయ, శేఖర్ మాస్టర్‌లు పోటీపడి జాకెట్‌లు విప్పడంతో ఆ ప్రోమోపై హాట్ టాపిక్ నడిచింది. ఇంతకీ వాళ్లిద్దరూ జాకెట్‌లు విప్పింది.. చిన్న టాస్క్‌లో భాగంగా అయితే.. మన ప్రోమో కటింగ్ ఎడిటర్ మామ మాత్రం.. తన కత్తెర ప్రతిభ చూపించి వాళ్లేదో చేస్తుంటే.. ఇంకేదో అనుకునేట్టు చేశాడు.
శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతున్న ఈ షో.. గత వారం తొలి ఎపిసోడ్‌లు రంజుగా సాగాయి. ఇక వచ్చేవారానికి సంబంధించిన ప్రోమో రిలీజ్ కాగా.. ‘కాలేజ్ థీమ్’తో కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ పోటీ పడుతున్నారు. కాలేజ్ రోజుల్ని గుర్తు చేసుకుంటూ.. పెర్ఫామెన్స్‌లో మామూలుగా లేవు.
అబ్బో.. రొట్ట, రోతబ్యాచ్ అంతా ఇక్కడే ఉందిగా అనేట్టుగా ఉంది ఈ కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్ షో. అనసూయకి తోడు.. ప్రియాంక సింగ్, శోభాశెట్టి, రీతూ చౌదరి, విష్ణు ప్రియ.. అబ్బో సోషల్ మీడియా రోత బ్యాచ్ అంతా ఈ షోలే కనిపించారు. ఒకర్ని మించి మరొకరు అనేట్టుగా రోత పుట్టించేస్తున్నారు. ‘‘కలలు తెరిచిన కన్నెపిల్ల.. కవిత రాసిన కన్నెపిల్ల.. క.. క.. క కాలేజీ స్టైలే’’ అంటూ అనసూయ ఆంటీని కన్నెపిల్లగా చూపిస్తూ.. ఆమె చేతికి పుస్తకాల్ని ఇచ్చి ఎరుపు చీరలో మైమరపించారు. అనసూయ అయితే చేతిలో పుస్తకాలను పట్టుకుని.. చీర చెంగుని గిరగిరా తిప్పుతూ.. అందర్నీ తనవైపు చూపు తిప్పుకునేట్టు చేసింది. ఇక బిగ్ బాస్ బ్యాచ్, సీరియల్ బ్యాచ్ వాళ్లు అయితే అనసూయ.. చీర తిప్పుడు చూసి.. వామ్మో అంటూ నెత్తిన చేతులెట్టేసుకున్నారు.
కాలేజ్‌లో స్టూడెంట్స్ అన్నారు.. పేరెంట్స్ కూడా ఉన్నారా? అని అంబటి అర్జున్‌పై పంచ్ వేసింది శ్రీముఖి. నిజానికి అక్కడున్న వాళ్లలో ఒకరిద్దరు మినహా ఇస్తే.. అంతా కాలేజ్ బ్యాచ్ కాదు.. పేరెంట్స్ బ్యాచే. చాలామందికి పెళ్లిళ్లు కాలేదంతే. ‘అబ్బా.. మీ కాలేజ్ కుర్రాళ్లకి క్రమశిక్షణ లేదు’ అని అనసూయ అంటే.. ‘మేడమ్ సార్ మేడమ్ అంతే’ అని కుర్రాళ్లు టీజ్ చేయడంతో.. తెగ మురిసిపోయింది అనసూయ. భలే సిగ్గుపడిందిలే.ఇక అంతా సాఫీగా సాగిపోతే అది రోత షో ఎందుకు అవుతుంది.. అంబటి అర్జున్, ప్రియాంక సింగ్‌లు రెచ్చిపోయారు. ప్రియాంకని కుక్కపిల్లని ఎత్తుకున్నట్టుగా ఎగరేసి మరీ ఎత్తేసుకున్నాడు అంబటి అర్జున్. ప్రియాంక సింగ్ అతన్ని తలపై గుద్దిపడేసింది. అతని చంకమాత్రం దిగలేదు. ఇక చివర్లో అనసూయ.. బాస్కెట్ బాల్ ఆడేస్తూ కనిపించింది. మొత్తానికి అనసూయ అయితే రెడ్ సారీలో అదరగొట్టేసింది.