top of page

అందం ఫుల్లు.. అవకాశాలు నిల్లు .. 🌟📸

MediaFx

ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ క్రేజ్ సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్. ఓరు ఆధార్ లవ్ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ చిన్నది. ఈ మూవీ డిజాస్టర్ అయినా తన అందంతో క్యూట్ నెస్ తో ఆకట్టుకుంది.

ఆతర్వాత మలయాళంలో సినిమాలు చేసింది. ఇక తెలుగులో నితిన్ హీరోగా నటించిన చెక్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. ఆతర్వాత చాలా కాలం కనిపించలేదు ఈ బ్యూటీ.

కానీ మలయాళంలో కొన్ని సినిమాలు చేసి ఆకట్టుకుంది. అందం , అభినయం ఉన్న ఈ అమ్మడికి అవకాశాలు మాత్రం రావడంలేదు. చాలా రోజుల తర్వాత తెలుగులో కనిపించింది ఈ వయ్యారి భామ కానీ ఆ సినిమా కూడా ఆదుకోలేదు.

తెలుగులో సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ హీరోలుగా నటించిన బ్రో సినిమాలో కనిపించింది ప్రియా ప్రకాష్ వారియర్. ఈ సినిమాలో తేజ్ సిస్టర్ గా కనిపించింది. కానీ ఈ సినిమా కూడా నిరాశపరచడంతో ఈ అమ్మడికి గుర్తింపు రాలేదు.

 కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. అవకాశాలు లేకపోయినా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంటుంది. అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిస్తుంది ఈ హాట్ బ్యూటీ.

 
bottom of page