top of page
MediaFx

మగమహారాజులకు అలర్ట్.. ఆ సమయంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే యమడేంజర్..

నేటి బిజీ లైఫ్‌లో మనం తరచుగా మన ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోతున్నాం.. ముఖ్యంగా పురుషులు తమ పని విషయంలో పడి.. తమ ఆరోగ్యాన్ని విస్మరిస్తారు. కానీ ఈ అజాగ్రత్త వారికి తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొనేలా చేస్తుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ పురుషులలో రెండవ అత్యంత సాధారణ క్యాన్సర్.. అజాగ్రత్తగా ఉంటే ఇది మనిషి ప్రాణాన్నే తీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రారంభ దశల్లో నిర్దిష్ట లక్షణాలంటూ కనిపించవు. కానీ మీరు కొన్ని సంకేతాలను విస్మరిస్తే భవిష్యత్తులో అది తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. ప్రతి మనిషి సీరియస్‌గా తీసుకోవలసిన 5 ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రారంభ లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు.. మూత్రవిసర్జనలో సమస్య: మూత్రవిసర్జనలో ఇబ్బంది ప్రోస్టేట్ క్యాన్సర్ సాధారణ లక్షణం. ఇది తరచుగా మూత్రవిసర్జన, మూత్రవిసర్జన సమయంలో మంటగా అనిపించడం, అడపాదడపా మూత్రవిసర్జన, మూత్రవిసర్జన చేయడానికి తరచూ నిద్రలేవడం లేదా మూత్రవిసర్జన చేసేటప్పుడు బలహీనంగా అనిపించడం వంటివి ఉంటాయి.

మూత్రం లేదా వీర్యంలో రక్తస్రావం: ప్రోస్టేట్ క్యాన్సర్ తీవ్రమైన లక్షణం మూత్రం లేదా వీర్యంలో రక్తస్రావం. అయితే, ఇది ఇతర సమస్యలకు కూడా సంకేతం కావచ్చు. అందువల్ల, ఇలాంటి సంకేతాన్ని గుర్తిస్తే.. వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.

వెన్నునొప్పి లేదా తుంటి నొప్పి: ప్రోస్టేట్ క్యాన్సర్ వ్యాపించినప్పుడు, అది చుట్టుపక్కల కణజాలాలకు చేరుకుంటుంది. దీని వలన వెన్నునొప్పి లేదా తుంటి నొప్పి వస్తుంది. కొన్నిసార్లు ఈ నొప్పి కాళ్లకు కూడా వ్యాపిస్తుంది.

స్కలనంలో సమస్య: వీర్యం స్కలనంలో ప్రోస్టేట్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ స్ఖలనాన్ని ప్రభావితం చేస్తుంది. స్కలనం సమయంలో నొప్పి, మంట లేదా కష్టాలను కలిగిస్తుంది.. దీంతో స్పెర్మ్ కౌంట్ కూడా తగ్గే అవకాశం ఉంది.

ఆకస్మాత్తుగా బరువు తగ్గడం: అనేక రకాల క్యాన్సర్లలో ఆకస్మాత్తుగా ఎక్కువగా బరువు తగ్గడం ఒక లక్షణం. అయితే, ఇది ఎల్లప్పుడూ ప్రోస్టేట్ క్యాన్సర్‌కు సంకేతం కాదు. కానీ మీరు ఎటువంటి కారణం లేకుండా బరువు తగ్గుతుంటే ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి.

bottom of page