పాన్ ఇండియా రేంజ్ లో ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన సూపర్ హీరో సినిమా 'హనుమాన్' లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించాడు.
ఈ చిత్రం జనవరి 12, 2024న వెండితెరపైకి వచ్చింది. తాజాగా ఇప్పుడు హనుమాన్ లోని ఈ సినిమా పూలమ్మే పిల్ల వీడియో సాంగ్ యూట్యూబ్ లో 50 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.అమృత అయ్యర్ ఈ సినిమాలో తేజ సరసన నటించింది . ఈ సినిమాలో వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్‌కుమార్, దీపక్ శెట్టి, గెటప్ శ్రీను, సత్య మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రలలో కనిపించారు. అనుదీప్ దేవ్, హరి గౌర, జై క్రిష్ మరియు కృష్ణ సౌరభ్ ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌లు అందించారు.✨