ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మంగళవారం జరిగే 23వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. చండీగఢ్‌లోని మహారాజా యద్వీంద్ర స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిథ్యమిస్తోంది.
గత మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై పంజాబ్ కింగ్స్ గెలుపొందింది. అలాగే చెన్నై సూపర్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో SRH జట్టు 5వ స్థానంలో ఉండగా, పంజాబ్ కింగ్స్ జట్టు 6వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో నూ గెలిచి పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఇక గత రికార్డుల విషయానికి వస్తే.. సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లు ఇప్పటి వరకు 21 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. SRH జట్టు 14 మ్యాచ్‌ల్లో గెలుపొందగా, పంజాబ్ కింగ్స్ 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇక్కడ SRH దే పైచేయి ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, పంజాబ్ కింగ్స్ నుంచి కూడా గట్టి పోటీని ఆశించవచ్చు.
కాగా ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. కాబట్టి ఎస్ ఆర్ హెచ్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. కాగా ఇరు జట్లు తమ ప్లేయింగ్ ఎలెవన్లలో ఎలాంటి మార్పులు చేయలేదు.