ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప-2’. ది రూల్ బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్మాత్మకమైన పాన్ ఇండియా చిత్రంగా ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. డిసెంబరు 6న చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన విడుదలైన ప్రతి ప్రమోషన్ కంటెంట్ అందరిలోనూ అంచనాలు పెంచేస్తున్నాయి. టీజర్‌తో పాటు విడుదలైన రెండు పాటలకు అనూహ్య స్పందన వచ్చింది.
దేవిశ్రీప్రసాద్ అత్యద్భుతమైన సంగీతానికి, చంద్రబోస్ సాహిత్యానికి.. ఆ పాటల్లో హీరో స్టెప్స్‌కి అందరూ ఫిదా అవుతున్నారు. రోజురోజు కు అంచనాలు పెంచుకుంటున్న ఈ చిత్రం గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ఆర్‌ఎఫ్‌సీలో భారీ వ్యయంతో వేసిన సెట్‌లో చాలా లావిష్‌గా జరుగుతుంది.
ప్రస్తుతం పతాక సన్నివేశాలు అత్యంత అద్బుతంగా చిత్రీకరించే పనిలో వున్నారు. హీరోతో పాటు సినిమాలోని కీలక నటులు పాల్గొంటున్నారు. సినిమాకు ఈ సన్నివేశాలు ఎంతో హైలైట్‌గా వుండబోతున్నాయని అంటున్నారు. అంతేకాదు రేపు థియేటర్‌లో ఈ పతాక సన్నివేశాలు గూజ్ బంప్స్ వచ్చే విధంగా వుంటాయని అంటున్నారు. సో. అల్లు అర్జున్ అభిమానులు మరో బ్లాక్‌బస్టర్ కోసం వెయిట్ చేయడమే తరువాయి అంటున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. ఇక పుష్ప సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఈ సినిమాతో అల్లు అర్జున్ నేషనల్ అవార్డు అందుకున్నాడు. ఇక ఇప్పుడు పుష్ప 2 కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.