ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీలే యూరప్ ట్రిప్ ముగించుకొని హైదరాబాద్ చేరుకున్నారు. షూటింగ్ కూడా రామోజీ ఫీల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతుంది. అయితే డైరెక్టర్ సుకుమార్‌తో ఉన్న వివాదం వలనే ఆయన వచ్చేశారని టాక్ వినిపిస్తోంది. దీంతో ఫ్యాన్స్ మళ్లీ గందరగోళంలో పడ్డారు. అయితే తాజాగా బన్నీవాసు టీమ్ ఇచ్చిన అప్‌డేట్‌తో రూమర్స్‌లో నిజం లేదని వెల్లడైంది.పుష్ప 2 తాజా అప్‌డేట్‌లో సినిమా షూటింగ్ అప్‌డేట్‌తో పాటు రిలీజ్ డేట్ కూడా వెల్లడించారు.
దీంతో సినిమా డిసెంబర్ 6న థియేటర్‌లోకి రావడం పక్కా అని సోషల్ మీడియాలో బన్నీ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. పుష్ప 2 సినిమా ఆగస్టు 15న రిలీజ్ చేస్తామని గతంలో టీమ్ వెల్లడించింది. డైరెక్టర్ సుకుమారే షూటింగ్‌ను ఆలస్యంగా చేస్తున్నారని ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. బ్లాక్ బస్టర్ అయిన పుష్పకు సీక్వేల్‌గా పుష్ప 2 వస్తుండటంతో సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. దీంతో సీన్ల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ, డైరెక్టర్ సుకుమార్ రీ షూట్ చేయడం వలన లేట్ అవుతుందని బన్నీ వాసు క్లారీటీ ఇచ్చారు. ఈ కారణాల వలనే ఐకాన్ స్టార్ అసంతృప్తిగా ఉన్నారనే దానిలో నిజం లేదని తెలిపారు.