top of page
MediaFx

'పుష్ప 2' ఆలస్యం - అల్లు శిరీష్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్​


అన్నయ్య అల్లుఅర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 విడుదల ఆలస్యం కావడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు అల్లు శిరీశ్. తాను నటించిన బడ్డీ మూవీ ప్రమోషన్స్‌లో దీని గురించి మాట్లాడారు. సినిమా ఎప్పుడు రిలీజైనా ఫ్యాన్స్​ అంచనాలను తప్పకుండా అందుకుంటుందన్నారు.

"పుష్ప 2పై మీ ఉత్సాహాన్ని ఇలాగే కంటిన్యూ చేయండి. డిసెంబర్‌ 6న వచ్చినా లేదా ఇంకెప్పుడు రిలీజైనా తప్పకుండా మీ అంచనాలను అందుకుంటుంది. ఇది మా అన్నయ్య సినిమా అని నేను చెప్పడం లేదు. సుకుమార్‌ చాలా అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని ఫిల్మ్‌నగర్‌లో మాట్లాడుకుంటుంటే విన్నాను. అదే మీతో చెబుతున్నాను" అని అభిమానుల్లో జోష్ నింపారు.

కాగా, ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్​గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, ప్రచార చిత్రాలు సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. మరోవైపు ఇప్పటికే బడ్డీ సినిమాను తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో ప్రీమియర్స్‌ వేయగా మంచిటాక్‌ వచ్చింది.

bottom of page