top of page
Shiva YT

సమంత విషయంలో ఊహించని ట్విస్ట్..

ఈ ఏడాది భారీ పాన్ ఇండియా సినిమాలు ప్రేక్షకులను పలుకరించబోతున్న విషయం తెలిసిందే. అందులో అందరూ ఎక్కువగా ఎదురుచూసేది పుష్ప2 కోసం. అయితే పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో, ఆ సినిమాలో ఊ అంటావా పాట అంతకు మించి హిట్ అయ్యింది. అయితే పార్ట్ 2 లో నటి సమంత ఐటం సాంగ్ చేస్తుందా.. లేదా? అని ప్రతి అభిమాని ఆశగా ఎదురుచూస్తున్నాడు. దానికి కంటిన్యూగా.. ఈ మూవీలో సమంత నటిస్తుందనే వార్తలు వినిపించడంతో మరిన్ని భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ అందరి అంచనాలను.. ఆలోచనలను తలకిందులు చేస్తూ… డైరెక్టర్ సుకుమార్ అతిథి పాత్ర కోసం సమంత రూత్ ప్రభును పరిశీలిస్తున్నట్లు సమాచారం. “పుష్ప 2: ది రూల్” ముగింపులో కనిపించే అవకాశం ఉందట. అది పుష్ప పార్ట్‌ 3 కి లీడ్‌గా ఉండనుందని లేటెస్ట్ బజ్‌.



bottom of page