ఎట్టకేలకు బన్నీ ఫ్యాన్స్ నిరీక్షణకు తెర పడింది. పుష్పరాజ్ బర్త్ డే ట్రీట్ ఇచ్చేశారు పుష్ప 2 మేకర్స్. ఈరోజు (ఏప్రిల్ 8న) స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా కాసేపటి క్రితమే పుష్ప 2 టీజర్ రిలీజ్ చేశారు.
భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ టీజర్ సినిమాపై మరింత హైప్ పెంచేసింది. పూర్తిగా మాస్ అవతారంలో బన్నీ.. దేవి శ్రీ అందించిన బీజీఎం గూస్ బంప్స్ తెప్పిస్తుంది. తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే బన్నీ ఇదివరకు ఎన్నడూ కనిపించని గెటప్‌లో కనిపించనున్నాడని తెలుస్తోంది. పట్టుచీరలో మెడలో నిమ్మకాయాల మాలతో ఒంటినిండా బంగారు ఆభరణాలతో అమ్మోరు గెటప్ లో కనిపించారు. గంగమ్మ జాతరలో ఉగ్రరూపంతో నడిస్తూ.. చీరకొంగును నడుముకు చుట్టుకుంటూ వస్తున్నట్లు చూపించారు. టీజర్ మొత్తంలో ఒక్క డైలాగ్ లేకుండా బీజీఎంతో గూస్ బంప్స్ తెప్పించారు. తాజాగా విడుదలైన టీజర్ మాత్రం బన్నీ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందించింది. గంగమ్మ జాతర జరిపించేందుకు అమ్మోరుగా వస్తున్న పుష్పరాజ్ గా కనిపిస్తున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.