top of page
MediaFx

‘పుష్ప 2’లో మరో స్పెషల్ సాంగ్..?🎶


ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రాబోతున్న సినిమా పుష్ప 2: ది రూల్. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి సాంగ్ సోషల్ మీడియాతో సహా వరల్డ్ వైడ్ గా మ్యూజిక్ ఛార్ట్స్ ని రూల్ చేస్తోంది. ఐతే, పుష్ప 2 లోని స్పెషల్ మాంటేజ్ సాంగ్ ఇంకా అద్భుతంగా ఉంటుందని.. పుష్ప లైఫ్ జర్నీ మొత్తాన్ని ఈ సాంగ్ లో సుకుమార్ చూపించబోతున్నాడని.. సెకండ్ హాఫ్ లో వచ్చే ఈ సాంగ్ మొత్తమ్మీద చాలా ఎమోషనల్ గా ఉంటుందని టాక్. ఇక ఈ సాంగ్ కోసం దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం కూడా అదిరిపోయిందట. పైగా కథ ప్రకారం ఈ మాంటేజ్ సాంగ్ చాలా కీలకం అని తెలుస్తోంది. మొత్తానికి ఈ సాంగ్ లో అల్లు అర్జున్ ని మునుపెన్నడూ చూడని సరికొత్త అవతార్ లో చూపించబోతున్నారట. ఏది ఏమైనా ‘పుష్ప 2’ కోసం ఫ్యాన్స్ రెట్టింపు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించింది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఆగస్టు 15న, 2024 లో ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది.


bottom of page