top of page
MediaFx

లక్ష రీల్స్ తో దూసుకెళ్తున్న “ది కపుల్ సాంగ్”


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విలేజ్ యాక్షన్ డ్రామా "పుష్ప 2: ది రూల్" ఆగస్ట్ 15, 2024 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సినిమా రిలీజ్ కి ఇంకా చాలా టైమ్ ఉన్నప్పటికీ, మేకర్స్ ప్రచార చిత్రాలతో ఆడియెన్స్ ను అలరిస్తూనే ఉన్నారు. 🎥

రిలీజైన పాటలు దేశ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. కపుల్ సాంగ్ "సూసేకి" సూపర్ రెస్పాన్స్ తో దూసుకు పోతుంది. ఈ పాటకి ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షకు పైగా రీల్స్ వచ్చాయి. ఇది ఆడియెన్స్‌లో ఏ రేంజ్ ఇంట్రెస్ట్‌ను కలిగి ఉందో చెప్పడానికి ఒక ఉదాహరణ అని చెప్పాలి. 🎶

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా, అనసూయ భరద్వాజ్, ధనంజయ, సునీల్, రావు రమేష్, ఫహాద్ ఫాసిల్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 🌟


bottom of page