top of page
MediaFx

పక్కా ప్లాన్‌తో వస్తున్న పుష్పరాజ్‌..


పుష్పరాజ్‌ స్పీడు పెంచారు. కల్కి రిజల్ట్ చూసిన తరువాత మరింత కాన్ఫిడెంట్‌గా అప్‌కమింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు. అదే సమయంలో కంటెంట్ విషయంలో మరింత కేర్‌ తీసుకుంటున్నారు. అందుకే షూటింగ్ నుంచి ప్రమోషన్స్‌ వరకు పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళుతున్నారు మేకర్స్‌. పుష్పరాజ్‌ మళ్లీ సెట్‌లో బిజీ అవుతున్నారు. షార్ట్ గ్యాప్ తరువాత పుష్ప 2 కొత్త షెడ్యూల్ ప్రారంభమవుతోంది. ఈ నెలఖరు వరకు బ్రేక్ లేకుండా ఈ షెడ్యూల్‌ను ప్లాన్ చేసింది చిత్రయూనిట్‌. ఈ షెడ్యూల్‌తో దాదాపు సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కు వచ్చేస్తుంది. ఆగస్టులో మరో 15 రోజుల షూటింగ్‌తో పుష్ప 2కు గుమ్మడికాయ కొట్టేయనుంది యూనిట్‌. ఆల్రెడీ షూటింగ్‌తో పాటు పోస్ట్‌ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. షెడ్యూల్‌ గ్యాప్స్‌లో ఎడిటింగ్‌తో పాటు ఇంత కార్యక్రమాలు చక్కబెట్టేస్తున్నారు సుక్కు అండ్ హిజ్‌ టీమ్‌. అందుకే ఆఫ్టర్ షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్‌ కోసం ఎక్కువ టైమ్ తీసుకోవట్లేదు. మ్యాగ్జిమమ్‌ నెలా, నెలన్నరలో పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్‌ కూడా పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్‌ నుంచే అసలు కథ మొదలు కానుంది. ఆల్రెడీ రెండు పాటలు ఓ టీజర్‌ వదిలిన పుష్ప 2 టీమ్‌, సెప్టెంబర్‌ నుంచి ప్రమోషన్స్ మీద సీరియస్‌గా ఫోకస్ చేయాలని నిర్ణయించింది. మరో టీజర్‌, సాంగ్‌తో ప్రమోషన్స్‌ను రీస్టార్ట్ చేసేలా ప్లాన్ రెడీ చేస్తున్నారు పుష్ప 2 మేకర్స్‌. కల్కి 2898 ఏడీ సక్సెస్‌ విషయంలో ప్రమోషన్స్‌ కూడా చాలా హెల్ప్ అయ్యాయి. అందుకే పుష్ప 2 విషయంలో కొత్త ప్రమోషన్‌ స్ట్రాటజీని సిద్ధం చేస్తున్నారు. ఆల్రెడీ పుష్ప 2 మీద పాన్ ఇండియా రేంజ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ హైప్‌ను మరింత పెంచేలా స్కెచ్‌ రెడీ చేస్తున్నారు. మేకింగ్ నుంచి ప్రమోషన్స్‌ వరకు ఏ విషయంలోనూ తగ్గేదే లే అంటూ దూసుకుపోతున్నారు పుష్ప రాజ్‌.

bottom of page