top of page
MediaFx

యూట్యూబ్ లో “పుష్పరాజ్” కి సెన్సేషన్ రెస్పాన్స్!


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రధాన పాత్రలో, డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ పుష్ప 2 ది రూల్ (Pushpa 2 the rule). ఈ చిత్రం ను ఆగస్ట్ 15, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం కి సంబందించిన టీజర్ ను రిలీజ్ చేయగా, సెన్సేషన్ రెస్పాన్స్ తో దూసుకు పోతుంది. ఇప్పటి వరకూ 130 మిలియన్స్ కి పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది ఈ టీజర్. అంతేకాక 2 మిలియన్స్ కి పైగా లైక్స్ ను రాబట్టడం జరిగింది.

ఈ చిత్రం నుండి రిలీజైన ఫస్ట్ సింగిల్ పుష్ప పుష్ప పాటకి కూడా అద్దిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. యూ ట్యూబ్ లో భారీ వ్యూస్ తో దూసుకు పోతుంది. ఇప్పటి వరకూ అన్ని భాషల్లో కలిపి 63 మిలియన్స్ కి పైగా వ్యూస్ ను రాబట్టడం జరిగింది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఫాహద్ ఫాసిల్, అనసూయ భరద్వాజ్, ధనంజయ, రావు రమేష్, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.


bottom of page