మలయాళ ఇండస్ట్రీ నుండి సెన్సేషన్ క్రియేట్ చేసిన మూవీ మంజుమ్మల్ బాయ్స్. ఈ చిత్రం తెలుగు వెర్షన్ ను పీవీఆర్ మల్టీప్లెక్స్ లలో నిలిపి వేయడం జరిగింది.
మంచి రన్ తో కొనసాగుతున్న ఈ చిత్రం ను నిలిపి వేయడం తో ఒక్కసారిగా ఈ ఇష్యూ అందరిలో చర్చాంశనీయం గా మారింది.అయితే కేరళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ లో కొంతమంది సభ్యులు రీసెంట్ గా కంటెంట్ ప్రొవైడింగ్ కంపెనీని ప్రారంభించారు. అయితే PDC అనే ఈ కొత్త కంపెనీ నుండి మాత్రమే డిజిటల్ ప్రింట్‌లను కొనుగోలు చేయాలని అన్ని థియేటర్‌లను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం దేశంలోనే అతిపెద్ద మల్టీప్లెక్స్ అయిన పీవీఆర్ కి నచ్చలేదు. PDC నుండి డిజిటల్ కంటెంట్‌ను కొనుగోలు చేయడానికి నిరాకరించింది.భారతదేశం అంతటా డబ్బింగ్ వెర్షన్‌లతో సహా మలయాళ చిత్రాల ప్రదర్శనను ప్రస్తుతానికి నిలిపివేసింది. ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆ ఆదేశాన్ని ఎత్తివేసే వరకు, పీవీఆర్ మల్టీప్లెక్స్ లలో మలయాళ సినిమాలను ప్రదర్శించే ఉద్దేశ్యం లేదని తెలుస్తోంది. ఈ ఇష్యూ ఎంత త్వరగా క్లియర్ అయితే, అంత త్వరగా ప్రొడ్యూసర్స్ కి రిలీఫ్ కానుంది.🎥✨