top of page

ధనుష్ ‘రాయన్’ ఫ‌స్ట్ సింగిల్ వచ్చేసింది

MediaFx

త‌మిళ న‌టుడు ధనుష్‌ (Dhanush) స్వీయ దర్శకత్వంలో వ‌స్తున్న తాజా చిత్రం రాయ‌న్ (Raayan). సందీప్ కిష‌న్‌, మ‌ల‌యాళం న‌టుడు కాళిదాస్ జ‌య‌రాం ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే మూవీ నుంచి ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేయ‌గా.. మ‌ట‌న్ కొట్టు రాయ‌న్‌గా ధ‌నుష్ లుక్‌తో పాటు సందీప్ కిష‌న్‌, కాళిదాస్ జ‌య‌రాం పోస్ట‌ర్‌లు వైర‌ల్ అయ్యియి. ఇక ఈ సినిమాను జూన్ నెల‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు చిత్ర‌యూనిట్ ప్ర‌క‌టించింది. అయితే విడుద‌ల‌కు ఇంకా నెల రోజులు ఉండ‌డంతో ఇప్ప‌టినుంచే ప్ర‌మోష‌న్స్ షూరు చేసింది రాయ‌న్ టీమ్. ఈ సినిమా నుంచి తాజాగా ఫ‌స్ట్ సింగిల్‌ను విడుద‌ల చేసింది.ఈ మూవీ నుంచి అడంగాత అసురన్ (Adangaatha Asuran) అనే ఫ‌స్ట్ సింగిల్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ పాట‌ను ఎ.ఆర్. రెహమాన్, ధనుష్ క‌లిసి పాడగా.. ధ‌నుష్ స్వ‌యంగా లిరిక్స్ అందించాడు. రెహమాన్ సంగీతం అందించాడు. ఈ సినిమా తమిళం, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో అపర్ణ బాలమురళి, విష్ణువిశాల్‌, దుషారా విజయన్‌, సెల్వ రాఘవన్‌, ఎస్‌జే సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాతో పాటు ధ‌నుష్ ప్ర‌స్తుతం శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో కుబేరా అనే సినిమా చేస్తున్నాడు.




bottom of page