top of page
MediaFx

ధనుష్ బెంచ్ మార్కె ప్రాజెక్ట్ “రాయణ్” రిలీజ్ డేట్ వచ్చేసింది.!

కోలీవుడ్ గ్లోబల్ నటుడు ధనుష్ హీరోగా ఇప్పుడు పలు చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రాల్లో తన కెరీర్ బెంచ్ మార్క్ చిత్రం 50వ ప్రాజెక్ట్ అది కూడా తన స్వీయ దర్శకత్వంలో చేస్తున్న సినిమా “రాయణ్”. మరి ఈ చిత్రం నుంచి అవైటెడ్ ఫస్ట్ సింగిల్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ ఇచ్చిన ఈ సాంగ్ వినేందుకు మంచి పవర్ఫుల్ గా అనిపిస్తుంది. మరి దీనితో పాటుగా ధనుష్ ఈ సినిమా అవైటెడ్ రిలీజ్ డేట్ ని కూడా ఇచ్చేసాడు.

ఈ చిత్రాన్ని జూన్ రిలీజ్ కి ఫిక్స్ చేయగా రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది సస్పెన్స్ గా మారింది. అయితే ఈ సినిమాని ఇప్పుడు మేకర్స్ ఈ జూన్ 13న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి ఈ డేట్ లో కమల్ నటించిన భారీ సినిమా ఇండియన్ 2 వస్తుంది అని టాక్ ఉంది. కానీ వాయిదా పడటంతో ధనుష్ అనుకున్నట్టుగానే తన సినిమాని దింపుతున్నాడు. అయితే ఈ చిత్రం తెలుగు, తమిళ్ సహా హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ కి రాబోతుంది.


bottom of page