top of page

అనంత్‌ అంబానీ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలో హైలైట్స్‌.. 🎉

రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ-రాధికా మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. గుజరాత్‌ జామ్‌నగర్‌లో నిర్వహించిన ఈ వేడుకలకు బాలీవుడ్‌ ప్రముఖులు, క్రికెటర్లు, పారిశ్రామిక దిగ్గజాలు హాజరయ్యారు.

రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ-రాధికా మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. గుజరాత్‌ జామ్‌నగర్‌లో నిర్వహించిన ఈ వేడుకలకు బాలీవుడ్‌ ప్రముఖులు, క్రికెటర్లు, పారిశ్రామిక దిగ్గజాలు హాజరయ్యారు. బిల్‌గేట్స్‌, ఇవాంకా ట్రంప్‌ వంటి విదేశీ ప్రముఖులు కూడా ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో చివరి రోజు ట్రిపులార్‌ సినిమాలోని నాటు నాటు పాటపై బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ స్టెప్పులేసి అలరించారు. షారూఖ్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, అమీర్‌ ఖాన్‌ డ్యాన్స్‌ చేశారు. అలాగే వేడుకల చివరి రోజు ముకేశ్‌ అంబానీ సతీమణి నీతా అంబానీ క్లాసికల్‌ డ్యాన్స్‌ చేశారు. జగన్మాత అవతారానికి సంబంధించిన నృత్యరూపకాన్ని ప్రదర్శించి ఆకట్టుకున్నారామె. 🎶

ఈ వేడుకల్లో భాగంగా రణ్‌బీర్‌-ఆలియా, దీపికా పదుకుణె-రణ్‌వీర్‌ సింగ్‌, కరీనా కపూర్‌-సైఫ్‌ తదితర బాలీవుడ్ జంటలు వేడుకల్లో డ్యాన్సులతో సందడి చేశారు. దీపికా పదుకుణె-రణ్‌వీర్‌ సింగ్‌ డ్యాన్స్‌ హైలైట్‌గా నిలిచింది. ప్రగ్నెన్సీ అనౌన్స్ చేసిన తర్వాత ఈ జంట తొలిసారి ఇలా డాన్స్ చేస్తూ కనిపించి ఆకట్టుకున్నారు. మరో వైపు బాలీవుడ్‌ స్టార్లు సల్మాన్‌ ఖాన్‌, షారూఖ్‌ ఖాన్‌ డ్యాన్సులతో అదరగొట్టారు. వెండితెరమీద స్టెప్పులేసే ఈ ఖాన్‌లు, ప్రీ వెడ్డింగ్‌లో వహ్వా అనిపించారు.

క్రికెట్‌ మాత్రమే ఆడే ధోనీ ధాండియా ఆడటం మీరెప్పుడైనా చూశారా? చూసి ఉండరు. అనంత్‌-రాధిక ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో MS‌ ధోనీ దాండియా ఆడారు. అలాగే వేడుకలకు హాజరైన ప్రముఖుల్లోసూపర్ స్టార్ రజినీకాంత్, అమితాబ్‌ బచ్చన్‌ కుటుంబ సభ్యులు, సచిన్‌ టెండుల్కర్‌ కుటుంబ సభ్యులు, అనిల్‌ కపూర్‌, అక్షయ్‌ కుమార్‌, రామ్‌చరణ్‌ తదితరులు ఉన్నారు. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌. మూడు రోజుల ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. ఈ వేడుక కోసం ఇప్పటికే చాలా మంది ప్రముఖులు జామ్ నగర్ చేరుకున్నారు. టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ దంపతులు హాజరయ్యారు. ఆతిథ్యం ఇవ్వడంతో ముకేష్‌ అంబానీ స్టయిలే వేరు. తన గారాల కొడుకు ప్రీ వెడ్డింగ్‌ కార్యక్రమానికి వచ్చిన అతిథులకు ఈ కుబేరుడు స్వయంగా వడ్డించారు. ప్రతి అతిథిని పలకరిస్తూ, నమస్కారం చేస్తూ, వడ్డించారు. ఈ వడ్డన ఇప్పుడు హైలైట్‌ అయింది. ఈ ప్రీ వెడ్డింగ్‌ వేడుకల హీరో అయిన అనంత్ అంబానీ డాన్స్‌ చేయడం మరో హైలైట్‌. అనంత్‌ డాన్స్‌కువచ్చిన అతిథులు చప్పట్లతో హోరెత్తించారు. 💃🕺


 
 
bottom of page