top of page
Suresh D

‘చంద్రముఖి 2’ రిలీజ్ వాయిదా, ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఎప్పుడంటే..🎞️💫

రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘చంద్రముఖి 2’ సినిమా విడుదల తేదీని మార్చారు. మొదట ఈ సినిమాను సెప్టెంబర్ 15న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే, సాంకేతిక కారణాలతో సెప్టెంబర్ 15న విడుదల చేయడం లేదని.. కొత్త తేదీ సెప్టెంబర్ 28ని ప్రకటించారు. వీఎఫ్ఎక్స్ వర్క్ ఇంకా పెండింగ్ ఉండడం వల్ల అనుకున్న తేదీకి విడుదల చేయలేకపోతున్నారనేది ఇండస్ట్రీ వర్గాల సమాచారం. దీంతో సెప్టెంబర్ 28కి వెళ్లారట. ఈ మేరకు విడుదల తేదీని మార్చిన సంగతి తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ ఒక వీడియో ప్రోమోను విడుదల చేసింది.🎞️💫



bottom of page