🎬 ప్రముఖ కొరియోగ్రాఫర్, హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో కాంచన సిరీస్ లో మరో కొత్త చిత్రం రాబోతోంది. కాంచన, కాంచన 2, కాంచన 3 చిత్రాలు ఘన విజయం సాధించాయి. తాజా సమాచారం ప్రకారం, కాంచన 4 చిత్రాన్ని కూడా రాఘవ లారెన్స్ స్వయంగా డైరెక్ట్ చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ చిత్రం షూటింగ్ సెప్టెంబర్‌లో మొదలుకానుంది.
అయితే, ఈ సినిమాలో ఎవరు నటించబోతున్నారన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఇటీవలి వార్తల ప్రకారం, సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో నటించనున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఈ వార్తలపై రాఘవ లారెన్స్ స్పందించాడు. సోషల్ మీడియాలో వస్తున్న ఈ రూమర్స్ లో ఎటువంటి నిజం లేదని, అలాంటి వార్తలను నమ్మవద్దని కోరాడు. కాంచన 4లో నటించే నటీనటుల వివరాలను రాఘవేంద్ర ప్రొడక్షన్ ద్వారా అధికారికంగా ప్రకటిస్తామని తెలిపాడు. త్వరలోనే ఈ వివరాలను వెల్లడిస్తామని లారెన్స్ ట్వీట్ చేశాడు.
రాఘవ లారెన్స్ చేసిన ట్వీట్‌తో మృణాల్ ఠాకూర్ కాంచన 4 చిత్రంలో నటించడం లేదని స్పష్టం అవుతోంది. ఇక ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి కొంతసేపు ఆగాల్సిందే.