దయచేసి విరాళాలు ఇవ్వొద్దంటున్న లారెన్స్..🎬✨
- Aug 31, 2023
- 1 min read
లారెన్స్ తన కెరీర్ తొలినాళ్ల నుంచి అనాథలకు, దివ్యాంగులకు ఒక ఆశాదీపంలా ఉన్నారు. 💖🕊️ వారి కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 🤝 కాగా ఇటీవల తన ట్రస్ట్‌కు డొనేషన్స్ పంపవద్దంటూ ఆయన చేసిన ట్వీట్ నెట్టింట తెగ ట్రెండ్ అయ్యింది. పలు రకాల కామెంట్స్ సైతం వచ్చాయి. 💬📄 దీంతో అందుకు గల కారణాన్ని వివరించారు . 💭

“డ్యాన్స్ మాస్టర్‌గా ఉన్నప్పుడు ఒక ట్రస్ట్ ప్రారంభించా. 60 మంది చిన్నారుల బాధ్యతలు తీసుకున్నా. 👶🧒 నాట్యంపై ఆసక్తి కలిగిన దివ్యాంగులకు శిక్షణ ఇచ్చా. 👩🎓 అప్పుడు నేను కొరియోగ్రాఫర్‌గా ఉన్నా… ఆర్థిక కారణాల వల్ల సేవా కార్యక్రమాల్లో ఇబ్బంది తలెత్తేది. 💰అందుకు ఆనాడు విరాళాలు తీసుకున్నా. 🤲 కానీ, ఇప్పుడు నేను దర్శకుడిగా, కథానాయకుడిగా రాణిస్తున్నా. మొదట్లో రెండేళ్లకు ఒక మూవీలో నటించేవాడిని. 🎬✨ ఇప్పుడు ఏడాదికి 3 సినిమాలు చేస్తున్నా. ఆదాయం కూడా బానే ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డాక కూడా వేరే వాళ్ల సాయం తీసుకోవడం కరెక్ట్ కాదనిపించింది. ✍️ అందుకే వీరాళాలు వద్దన్నా తప్ప.. పొగరుతో కాదు. 🙅♂️ నిజంగా మీరు సాయం చేయాలనుకుంటే.. ఇబ్బందుల్లో ఉన్నవారికి తోడుగా నిలబడండి. లేదా వేరే ట్రస్ట్‌ల ద్వారా ఇతరులకు సాయం చేయండి’’ అని లారెన్స్ పిలుపునిచ్చారు. 🙏