top of page
MediaFx

నాపై ఈడీ దాడికి ప్లాన్ వేశారు: రాహుల్ గాంధీ..


త‌న‌పై దాడి చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ ప్లాన్ చేస్తోంద‌ని రాహుల్ గాంధీ(Rahul Gandhi) అన్నారు. ఈ విష‌యాన్ని ఆ సంస్థ‌లో ప‌నిచేస్తున్న కొంద‌రు త‌న‌కు ఆ స‌మాచారాన్ని చేర‌వేసిన‌ట్లు చెప్పారు. పార్ల‌మెంట్‌లో బీజేపీపై చ‌క్ర‌వ్యూహాం విమ‌ర్శ‌లు చేసినందుకు .. ఈడీతో సోదాలో చేయాల‌న్న ఆలోచ‌న‌లో కేంద్రం ఉన్న‌ట్లు ఆయ‌న ఆరోపించారు. ఇవాళ త‌న ఎక్స్ అకౌంట్‌లో రాహుల్ గాంధీ ఈ విష‌యాన్ని తెలిపారు. అయితే ఈడీ త‌నిఖీల‌ను ఎదుర్కొనేందుకు రిక్త హ‌స్తాల‌తో ఎదురుచూస్తున్న‌ట్లు రాహుల్ చెప్పారు. చ‌క్ర‌వ్యూహాంపై త‌న ప్రసంగాన్ని ఒక్క‌రిలో ఇద్ద‌రు న‌చ్చ‌లేద‌న్నారు. చ‌క్ర‌వ్యూహం త‌ర‌హాలో ఆరుగురు వ్య‌క్తులు దేశాన్ని నాశ‌నం చేస్తున్న‌ట్లు రాహుల్ ఆరోపించారు. అయితే ఆ చ‌క్ర‌వ్యూహాన్ని ఇండియా కూట‌మి బ‌ద్ద‌లు కొట్ట‌నున్న‌ట్లు చెప్పారు.



bottom of page