రాహుల్ గాంధీ కుట్టిన చెప్పులకు భారీ గిరాకీ..
- MediaFx
- Aug 2, 2024
- 1 min read
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల యూపీలోని సుల్తాన్‌పూర్‌లో ఓ చెప్పులు కుట్టే వ్యక్తిని కలిశారు. ఆయన బాధలు విని చెప్పులు కుట్టేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు వాటికి డిమాండ్ పెరిగిందట. ఆ చెప్పుల కోసం 10 లక్షలు ఇచ్చేందుకు ఓ వ్యక్తి ఆఫర్ చేయగా తాను తిరస్కరించానని దుకాణ యజమాని తెలిపారు. రాహుల్ రాక తర్వాత తన జీవితం మారిపోయిందని, గౌరవం పెరిగిందని చెప్పారు.