top of page
MediaFx

రాహుల్ గాంధీతో డేటింగ్ చేయాలని ఉంది..


కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో డేటింగ్ చేయాలనే కోరికను ఆమె వ్యక్తం చేశారు. కానీ ఇది ఇటీవలి ఇంటర్వ్యూ కాదు. ‘జబ్ వి మెట్’ సినిమా ప్రమోషన్ సందర్భంగా ఆమె ఇచ్చిన స్టేట్‌మెంట్ ఇది.ఈ కామెంట్స్ అప్పట్లో సర్వత్రా చర్చనీయాంశమైయ్యాయి . ఇప్పుడు ఆ వీడియో మళ్లీ వైరల్ అవుతోంది. కరీనా కపూర్ ప్రస్తుతం సైఫ్ అలీఖాన్‌ను పెళ్లి చేసుకొని ఫ్యాపీగా జీవిస్తుంది. కరీనా కపూర్ ‘జబ్ వి మెట్’ ప్రమోషన్స్‌లో పాల్గొంది. ఇందుకోసం సిమి నిర్వహించిన టాక్ షోలో పాల్గొంది ఆమె. కరీనాను మీరు ఎవరితో డేటింగ్ చేయాలని అనుకుంటున్నారు అన్న ప్రశ్నకు..? ఆమె నేరుగా రాహుల్ గాంధీ పేరును చెప్పింది. రాహుల్ గాంధీ పేరు చెప్పేటప్పుడు కరీనా కాస్త కంగారుపడింది. కరీనా కపూర్ మాట్లాడుతూ.. ‘ఆయన పేరు చెబితే వివాదం వస్తుంది’ అని చెప్తూనే.. ‘రాహుల్ గాంధీ డేటింగ్ చేయాలని ఉంది. బహుశా ఈ కామెంట్స్‌తో వివాదం రావచ్చునని కరీనా కపూర్ చెప్పుకొచ్చింది. కరీనా కామెంట్స్‌తో చాలామంది ఆశ్చర్యపోయారు. ఈ వీడియో ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది. దీనిపై అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఆ సమయంలో రాహుల్ గాంధీ చాలా అందంగా ఉండేవారు. మీరు చెప్పిన దాంట్లో తప్పు లేదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కరీనా కపూర్ నటించిన ‘క్రూ’ ఇటీవల విడుదలై ప్రశంసలు అందుకుంది. యశ్‌ నటిస్తున్న ‘టాక్సిక్‌’ చిత్రంలో ఆమె నటిస్తుందని టాక్ వినిపిస్తుంది.



bottom of page