ఇంపాల్/ మణిపూర్: రిజర్వేషన్ల విషయంలో రెండు కులాలకు సంబందించి జరుగుతున్న గొడవలు హింసకు దారితీశాయి.
మణిపూర్ లో రెండు జాతుల మధ్య జరుగుతున్న పోరాటం హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. మణిపూర్ లో జరుగుతున్న గొడవల కారణంగా ఇప్పటికే వంద మందికి పైగా అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇప్పుడు మణిపూర్ లో పొలిటికల్ వార్ మొదలు కావడంతో ఆ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి.కలహాలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో రెండు రోజుల పర్యటనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ కాన్వాయ్ ని మణిపూర్ రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌కు కొంచెం దూరంలో ఉన్న సహాయ శిబిరం సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. ఇంపాల్ సమీపంలోని సహాయ శిభిరంలో ఉంటున్న వారిని పరామర్శించి వారి నుంచి వివరాలు సేకరించడానికి ప్రయత్నించిన రాహుల్ గాంధీకి పోలీసులు షాక్ ఇచ్చారు.