top of page

తాను రాజకీయాల్లోకి రావడం లేదన్న రాహుల్ సిప్లిగంజ్..

తాను రాజకీయాల్లోకి వస్తున్నానంటూ వస్తున్న వార్తలపై ప్రముఖ సింగర్, బిగ్‌బాస్‌ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌ స్పందించాడు.

తాను రాజకీయాల్లోకి వస్తున్నానంటూ వస్తున్న వార్తలపై ప్రముఖ సింగర్, బిగ్‌బాస్‌ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌ స్పందించాడు. గోషామహల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నానంటూ జరుగుతున్న ప్రచారం ఫేక్ అని స్పష్టత ఇచ్చాడు. తాను రాజకీయాల్లోకి రావడం లేదని పేర్కొంటూ ఇన్‌స్టా, ట్విట్టర్‌‌లో పోస్టు చేశాడు.“నేను రాజకీయాల్లోకి వస్తున్నానంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. అన్ని పార్టీలను, నేతలను గౌరవిస్తాను. నేను ఒక కళాకారుడిని. అందరికీ వినోదం పంచడమే నా పని. నా జీవితమంతా అందుకే అంకితం. ఈ రాజకీయ వార్తలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయో అర్థం కావడం లేదు” అని పేర్కొన్నాడు.


 
 
bottom of page