తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులుగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వర్ష సూచన చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులుగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వర్ష సూచన చేసింది. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం రెండు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. బంగాళాఖాతంలో అల్పపీడనానికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఋతుపవన ద్రోణి బలంగా కొనసాగుతోంది. వీటి ప్రభావంతో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఏపీలో కోస్తా జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ఈనెల 17వరకు ఉభయ తెలుగు రాష్ట్రలకు వర్ష సూచన ఉన్నట్టు ప్రకటించింది భారత వాతావరణ శాఖ. కోస్తాలో తేలిక పాటి నుంచి మోస్తారు, భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. చాలా చోట్ల ఓ మోస్తరు.. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండి తాజా వెదర్ బుల్లెటిన్లో వెల్లడించింది.