🚨 ఈరోజు కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతిపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ,
తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.🌊 మిగిలిన చోట్ల తేలికపాటి వర్షం పడే అవకాశం.. పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. 🌀బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి.🌊 సముద్రంలో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని సూచిస్తుంది భారత వాతావరణ శాఖ.🌦️ ఈనెల 15 వరకు ఈ సూచనలు పాటించాలని ప్రకటించింది.🌦️ మరోవైపు తెలంగాణలో కూడా ఐదు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో ఉరములు, మెరుపులతో కూడిన తెలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. 🌤️ మంగళవారం, బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. 🌧️