రాజ్ తరుణ్ వివాదంపై ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ డిబేట్ నిర్వహించింది. డిబేట్‌లో రాజ్ తరుణ్ స్నేహితుడు ఆర్జే శేఖర్ భాషా పాల్గొన్నారు. గతంలో శేఖర్ బాషా లావణ్య పై ఆరోపణలు చేశాడు. తాజాగా ఈ డిబేట్ లో ఆర్జే శేఖర్ మాట్లాడుతూ లావణ్య గురించి మాట్లాడుతుండగా ఎదురుగా కూర్చున్న లావణ్య ఒక్కసారిగా చెప్పు తీసి ఆర్కే శేఖర్ వైపు విసిరింది. చెప్పు తగలడంతో పైకి లేచిన శేఖర్, లావణ్య గట్టిగా అరిచి ఆమెపై గొడవకు దిగాడు.
ఆర్జే శేఖర్‌పై లావణ్య చెప్పు విసిరిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ తర్వాత శేఖర్ అదే షోలో లావణ్యపై కూడా దుర్భాషలాడాడు. దానికి లావణ్య.. ‘శేఖర్ చెప్పిన మాటలు సరిగా లేకపోవడంతో కొట్టాను’ అని చెప్పింది. అలాగే, ‘మీకు కావాలంటే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి’ అని చెప్పింది లావణ్య.
రాజ్ తరుణ్, లావణ్య చాలా ఏళ్లుగా లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. పెళ్లి చేసుకుంటామని లావణ్యకు రాజ్ తరుణ్ హామీ ఇచ్చాడు. అయితే తాజాగా, రాజ్ తరుణ్‌కి హిమాచల్ ప్రదేశ్‌కి చెందిన నటి మాల్వీ మల్హోత్రాతో సంబంధం ఉందని లావణ్య ఆరోపిస్తుంది. మాల్వీ మల్హోత్రా కూడా లావణ్యపై ఫిర్యాదు చేసింది. మాల్వీ మల్హోత్రా సోదరుడు, తల్లిదండ్రులు చంపేస్తానని బెదిరించిందని లావణ్య ఆరోపించింది. రాజ్ తరుణ్ చాలా పాపులర్ సినిమాల్లో నటించాడు. ‘ఉయ్యాల జంపాల’, ‘కుమారి 21 ఎఫ్’, ‘సినిమా చూపిస్తా మావ’, ‘ఒరేయ్ బుజ్జిగా’ వంటి మరెన్నో సినిమాల్లో నటించాడు. తాజాగా నాగార్జునతో ‘నా సామి రంగ’లో నటించాడు. ఇప్పుడు రాజ్ తరుణ్ నటించిన ‘తిరగబడరా సామి’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో మాల్వీ మల్హోత్రా హీరోయిన్ గా నటిస్తుంది.