top of page
MediaFx

పోలీస్‌ స్టేషన్‌కెళ్లిన రాజ్‌ తరుణ్‌ పేరెంట్స్..


ఓ పక్క ముందస్తు బెయిల్ కోసం.. రాజ్ తరుణ్ హైకోర్టును ఆశ్రయించిన వేళ.. రాజ్‌ తరుణ్ పేరెంట్స్‌ కూడా.. పోలీస్‌ స్టేషన్‌ మెట్లెక్కారు. లావణ్య వల్ల తమకు ప్రాణ హాని ఉందంటూ మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో రాజ్‌ తరుణ్ పేరెంట్స్ కంప్లైంట్ చేశారు. లావణ్యకు నేరచరిత్ర ఉంది.. కాబట్టి తమను ఏమైనా చేసే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు తమకు ఆరోగ్యం సరిగ్గా లేదని కంప్లైంట్ కోట్ చేశారు. కాకతీయ హిల్స్‌ లోని తమ ఇంటికి వచ్చిన లావణ్య న్యూసెన్స్ చేసిందని.. డోర్స్ తీయాలంటూ పెద్ద పెద్దగా అరుస్తూ తలుపులను గట్టిగా కొట్టిందని కంప్లైంట్ లో తెలిపారు. తమకు ప్రొటెక్షన్ కావాలని మాదాపూర్ పోలీసులను రిక్వెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తామని చెప్పారు. ఇక లావణ్యకు వ్యతిరేకంగా అన్ని ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని.. అన్నీ కోర్టులో తేల్చుకుంటామని చెప్పారు రాజ్‌ తరుణ్ తరుపున లాయర్ మధుశర్మ . అంతేకాదు ప్రతీ చోట ఉమెన్ విక్టిమ్ కార్డ్ పని చేయదని చెప్పారు.

bottom of page