top of page
MediaFx

జక్కన్న స్ట్రాటజీ.. మహేష్‌ మూవీకి బాహుబలి ఫార్ములా!! 🌳🔥

దర్శకధీరుడు రాజమౌళి అమరచిత్ర కథల ఇన్‌స్పిరేషన్‌తో బాహుబలి లాంటి విజువల్ వండర్‌ను క్రియేట్ చేసినట్లు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు మహేష్ బాబుతో చేసే కొత్త సినిమాకి కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారట.

తాజాగా మహేష్ బాబు హీరోగా ఫారెస్ట్ బేస్డ్ యాక్షన్ థ్రిల్లర్‌ను రాజమౌళి రూపొందించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఇంగ్లీష్ రైటర్‌ విల్బర్ స్మిత్ రాసిన ట్రింఫ్ ఆఫ్ ది సన్‌, కింగ్‌ ఆఫ్‌ కింగ్స్ నవలల హక్కులు రాజమౌళి తీసుకున్నట్లు సమాచారం.

నవలల ఆధారంగానే కథ రెడీ చేయకపోయినా, కొన్ని సీన్స్‌ను రిఫరెన్స్‌గా తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. భవిష్యత్తులో లీగల్‌ ఇష్యూస్ లేకుండా ముందే హక్కులు తీసుకున్నారని ముంబై మీడియాలో వినిపిస్తోంది.

మహేష్ బాబు - రాజమౌళి మూవీలో విజయవంతమైన నావెల్స్‌కు సంబంధించిన రిఫరెన్స్‌లు ఉంటాయన్న వార్తతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

bottom of page